Home  »  TV News  »  గోధుమ పిండికి, మరమరాలకి కూడా నువ్వు నామినేట్ చేస్తావ్!

Updated : Nov 1, 2022

బిగ్ బాస్ యాభై ఏడవ రోజు 'చిలకలూరి చింతామణి' పాటతో మొదలైంది.  ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ మధ్య గుసగుసలు. 'ఐ మిస్ యూ సూర్య' అని ఇనయా బాధపడుతూ కూర్చుంది. ఓ వైపు ఫైమా, గీతు 'ఇనయా ఫేక్' అని మాట్లాడుకున్నారు. మరో వైపు మెరీనా, కీర్తి భట్, ఇనయా "ఈ సారి గీతుకి నామినేషన్ వేయాలి" అని టార్గెట్ చేసారు. అయితే నిన్న జరిగిన నామినేషన్లో ఒక్కో కంటెస్టెంట్ చెప్పిన రీజన్స్ అన్నీ  కొత్తగా ఉన్నా , కొన్ని మాత్రం సిల్లీగా అనిపించాయి. అందులో ఒకటి ఇనయా, ఆదిరెడ్డిని నామినేట్ చేసిన తర్వాత ఆదిరెడ్డి చెప్పిన సమాధానం అని చెప్పుకోవచ్చు.

అయితే నామినేషన్లో భాగంగా మొదట ఇనయా, గీతుని నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఆదిరెడ్డిని నామినేట్ చేసాకా మాట్లాడుతూ, "మీరు నన్ను ఫేక్ అన్నారు. నేను నాలాగా ఆడుతున్నాను. నా గేమ్ నేను ఆడుతున్నాను. కానీ నాకు మీ గేమ్ ఫేక్ అనిపించింది" అని ఇనయా అనగా, ఆదిరెడ్డి మాట్లాడుతూ, " ఏందమ్మా నువ్వు. సూర్య అంటే ఇష్టం అంటావ్. నమ్మకద్రోహం చేసావ్. వెన్నుపోటు పొడ్చావ్. సూర్యకి నామినేషన్లో గట్టిగా వేసావ్. బయటకు పోయాడు. అసలు రీజన్ ఏ లేదు. పాయింట్స్ చెప్పి నామినేషన్ వేయు. లాస్ట్ వీక్ చమ్కీలు అని చెప్పి శ్రీహాన్ ని నామినేట్ చేసావ్. రేపు పొద్దున గోధుమ పిండికి, మరమరాలకి కూడా నామినేట్ చేస్తావ్ నువ్వు" అని ఆదిరెడ్డి అనగా,  మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కాసేపు నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇనయా మాట్లాడుతూ, "నేను గోధుమ పిండికి, మరమరాలకి నామినేట్ చేసానా" అని గట్టిగా అరిచింది. 

కాగా ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు. వీరిద్దరు ఒకరి మీద ఒకరు నామినేషన్ వేస్కోవడం అనేది ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో ఇనయా మీద ఎక్కువ నామినేషన్స్ పడ్డాయనే చెప్పాలి. కాగా ఇనయా, ఆదిరెడ్డిల నామినేషన్ చాలా కామెడీగా మారింది. అయితే ఈ వారం వీరిద్దరిలో ఎవరు సేవ్ అవుతారో చూడాలి మరి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.